గుంతకల్లు: గుంతకల్లులో బాలిక అదృశ్యం, పోలీసులకు ఫిర్యాదు
గుంతకల్లులోని మహబూబ్ నగర్ కాలనీకి చెందిన దీక్షిత అనే బాలిక అదృశ్యమైంది. మంగళవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన దీక్షిత తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు దీక్షిత ఆచూకీ కోసం చుట్టుపక్కల గాలించారు. అయినా ఆచూకీ లభించలేదు. దీంతో తండ్రి శ్రీనివాస రావు మంగళవారం రాత్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన కుమార్తె దీక్షిత కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రకటించారు.