కడప: HPCL డిపోలో పెట్రోల్ ట్యాంకర్ల లీజు టెండర్లో స్థానికులకు అన్యాయం జరిగిందని ట్యాంకర్ల ఓనర్లు, డ్రైవర్లు ఆవేదన
Kadapa, YSR | Sep 15, 2025 హెచ్పీసీఎల్ డిపోలో పెట్రోల్ ట్యాంకర్ల లీజు టెండర్లో స్థానికులకు అన్యాయం జరిగిందని ట్యాంకర్ల ఓనర్లు, డ్రైవర్లు వాపోయారు. ఇక్కడ 5 ఏళ్లుగా ఇక్కడ సేవలు అందిస్తున్నామని తెలిపారు. కంపెనీ సూచనలతో వాహనాలను మోడలింగ్ చేయించామని తెలిపారు. అయితే తాజా టెండర్లో తమిళనాడు వ్యక్తులకు లీజును అప్పగించారన్నారు. తమ జీవనాధారం ప్రమాదంలో ఉందని, స్థానికులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యం తమకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.