ఒంగోలు అర్బన్: ఒంగోలులో జనసేన కార్యకర్తల సమావేశం, మాజీ మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ తోనే ఉంటానని వెల్లడి
Ongole Urban, Prakasam | May 9, 2026
తాను జనసేన వల్లే రెండుసార్లు ఓడిపోయానని మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం ఒంగోలులో జరిగిన జనసేన కార్యకర్తల సమావేశంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వైసిపి వల్ల తాను నష్టపోయానని.. తనను అధిష్టానం ఇబ్బందులు పెట్టిందన్నారు. దాదాపు 20 కోట్ల రూపాయలకు పైగా ఆర్థికంగా నష్టపోయారని తాను పవన్ కళ్యాణ్ తోనే ఉంటానని అన్నారు. అవకాశం ఇస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా తీస్తానని బాలినేని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు పాల్గొన్నారు.