నంద్యాల అర్బన్: కర్నూల్ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన వైసిపి నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి
Nandyal Urban, Nandyal | Jun 9, 2026
రెండు వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టేలా, దురుద్దేశపూర్వకంగా అవమానించడం వంటి వ్యాఖ్యల నేపథ్యంలో YCP నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై BNS 351, 352, 356 సెక్షన్స్ ప్రకారం కేసు నమోదైన విషయం తెలిసిందే. మంగళవారం కర్నూలు 3 టౌన్ PSకు విచారణ నిమిత్తం సిద్ధార్థ రెడ్డి హాజరయ్యారు. '41 నోటీసు ఇచ్చారు. విచారణ నిమిత్తం ఇక్కడికి వచ్చా. ఆ రోజు ధర్నాలో ఏమేం జరిగిందో వారికి వివరించా' అని సిద్ధార్థ రెడ్డి అన్నారు.