బనగానపల్లె: కొలిమిగుండ్లలో ఈనెల 27 నుంచి రాయలసీమ స్థాయి క్రికెట్ పోటీలు
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల జడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఈనెల 27 నుంచి రాయలసీమ స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు నాగకుళాయి, రమణ శనివారం వెల్లడించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో వరుస బహుమతులు రూ.25,116,రూ.15,116, రూ.10,116 దాతల సహకారంతో అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు