కోడుమూరు: రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను ఆత్మీయ స్వాగతం పలికిన కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ రాయలసీమ యూనివర్సిటీలో 4వ కాన్వకేషన్ కార్యక్రమంలో బుధవారం పాల్గొన్నారు. జిల్లా పర్యటనకు ప్రత్యేక విమానంలో విచ్చేసిన గవర్నర్ కు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం రాయలసీమ యూనివర్సిటీలో జరిగిన కాన్వకేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే హాజరై వీక్షించారు.