పొన్నూరు: ప్రతీ ఒక్కరూ స్వచ్ఛ ఆంధ్రలో భాగస్వామ్యం కావాలి: జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా
ప్రతీ ఒక్కరూ స్వచ్ఛ ఆంధ్రలో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. స్వర్ణ ఆంధ్రా స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో పెదకాకాని మండలం తక్కెళ్లపాడు గ్రామంలో శనివారం ఉదయం జరిగిన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ధూళిపాళ నరేంద్ర కుమార్ తో కలసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ "హరిత ఆంధ్రప్రదేశ్" నినాదంతో ఈ నెల స్వర్ణ ఆంధ్రా స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.