ఒంగోలు అర్బన్: ఫిషింగ్ హార్బర్ నిర్మాణం ద్వారా అభివృద్ధి పరంగా కొత్తపట్నంతో పాటు మొత్తం తీర ప్రాంత ముఖచిత్రమే మారిపోతుంది: ఎంపీ మాగుంట
Ongole Urban, Prakasam | Jun 23, 2026
ఫిషింగ్ హార్బర్ నిర్మాణం ద్వారా అభివృద్ధి పరంగా కొత్తపట్నంతో పాటు మొత్తం తీర ప్రాంత ముఖచిత్రమే మారిపోతుందని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుతో కలిసి మంగళవారం ఆయన పల్లెపాలెంలో ఈ హార్బర్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రానికి మొత్తం నాలుగు హార్బర్లు మంజూరు కాగా, వాటిలో ఒకటి కొత్తపట్నం మండలానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. అయితే నిర్మాణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాపై అస్పష్టత వలన పనులు ప్రారంభించడం కొంత జాప్యం జరిగిందన్నారు.