తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఆదివారం జోరుగా వరి నాట్లు సాగుతున్నాయి. ఇటీవల కాలంలో కురిసిన వర్షాలకు ఆయా మండలాల్లోని పొలాలు నీటితో మునిగాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు పంట పొలాల్లో నీళ్లు తగ్గడంతో రైతులు వరి నాట్లు మొదలుపెట్టారు. నియోజకవర్గ పరిధిలోని నాయుడుపేట, పెళ్ళకూరు, తడ, ఓజిలి మండలాల్లోని గ్రామాల్లో రైతులు వరి నాట్లకు పొలాలను సిద్ధం చేస్తున్నారు.