యర్రగుంట వద్ద హంద్రీనీవా నీటి ద్వారా పొంగిపొర్లుతున్న చెక్ డాం పరిశీలించిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం యర్రగుంట గ్రామం వద్ద హంద్రీనీవా కాలువ ద్వారా వచ్చిన నీటితో నిండి పొంగిపొర్లుతున్న చెక్దామును శుక్రవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ గతంలో వైసిపి ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు కుప్పంకు హంద్రీనీవా కాలువ ద్వారా నీటిని తీసుకుపోతున్నాడని వైసీపీ ఎమ్మెల్యే విమర్శలు చేయడం జరిగిందని,అయితే అందులో నిజం లేదని హంద్రీనీవా కాలువ ద్వారా నీటిని అనేక చెరువులు నింపుతున్నామని మరింత నీరు జిల్లాకు కేటాయించాలని మంత్రిని కోరడం జరిగిందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.