రాయచోటి: జిల్లా న్యాయ సేవాధికారి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీ ఎస్. బాబా ఫక్రుద్దీన్ రాయచోటి సబ్ జైలులో లీగల్ ఎయిడ్ క్లినిక్ ను పరిశీలించారు. ఖైదీల హక్కులు, ఉచిత న్యాయ సహాయం, ఆరోగ్య పరిస్థితులు, కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఖైదీలు ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జైలు పరిసరాలు, రిజిస్టర్లను పరిశీలించి తగిన సూచనలు ఇచ్చారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ 15100 గురించి ప్రచారం చేశారు.ఈ కార్యక్రమంలో సబ్ జైలు సూపర్డెంట్, ప్యానల్ న్యాయవాది మరియు ఖైదీలు పాల్గొన్నారు.