ఒంగోలు అర్బన్: పర్యావరణం పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత:ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Jun 5, 2026
పర్యావరణ పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. శుక్రవారం దర్శి నియోజకవర్గంలో కలెక్టర్ రాజాబాబు పర్యటించి ప్రపంచ పర్యావరణ దినోత్సవం లో పాల్గొన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబు భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని సూచించినట్లు తెలిపారు.