డోన్: ప్యాపిలి లో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు
Dhone, Nandyal | Apr 2, 2026 నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం వెంగళం పల్లె చెరువు కట్ట సమీపంలో జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం బైకును ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని స్థానికుల సహాయంతో డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి ప్యాపిలికి చెందిన వాసిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.