జఫర్గఢ్: జనగామ: తిమ్మంపేటలో సాగునీరు అందక ఎండుతున్న పంటలు - రైతుల ఆవేదన
జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం తిమ్మంపేటలో పిల్ల కాలువల్లో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువలు తవ్వి ఏళ్లు గడుస్తున్నా నీరు రావడం లేదని, పొలాల్లో పశువులను మేపుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి నీటి పారుదలకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.