ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలోని సిఐటియు స్తూపం వద్ద: ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో శుక్రవారం మే డే దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఆళ్లగడ్డ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద వెలిసిన సిఐటియు స్థూపం వద్ద శుక్రవారం ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు, సిఐటియు నాయకుడు శ్రీనివాసులు ఆధ్వర్యంలో 14వ మే డే ను పురస్కరించుకొని పతాకాన్ని ఆవిష్కరించారు, ఆళ్లగడ్డ నియోజకవర్గం లోని కార్మిక కర్షక సోదరులందరికీ ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు, ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామచంద్రుడు సిఐటియు నాయకులు కార్మికులు పాల్గొన్నారు.