నంద్యాల అర్బన్: హైకోర్టు ఆదేశాలతో నంద్యాల మార్కెట్ యార్డ్ షాపులకు ఈనెల 9 వేలం పాటలు : చైర్మన్ హరిబాబు
Nandyal Urban, Nandyal | Jun 5, 2026
నంద్యాల పట్టణంలోని మార్కెట్ యార్డ్ కు సంబంధించిన ఒకటి నుండి పది షాపులతో పాటు ఒక గోదాముకు ఈనెల 9వ తేదీన వేలంపాటలు నిర్వహిస్తున్నట్లు మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు తెలిపారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు వేలంపాటలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వేలం పాటల్లో పాల్గొనేవారు ఈనెల ఎనిమిదో తేదీలోపు 1000 రూపాయలు అప్లికేషన్ ఫీజు 5000 రూపాయలు డిపాజిట్ చెల్లించాలని కోరారు. ఇప్పటికే ఆ షాపులలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి సంబంధించిన శిల్పాసాకర్ నంది రైతు సమాఖ్యలు ఉండడంతో ఇప్పుడు రాజకీయంగా ఈ అంశం చర్చని అంశంగా మారింది