తిరువూరు పట్టణంలోని సర్వోదయ పాఠశాల వద్ద కూలిపోయిన బిల్డింగ్ పై కప్పు
Tiruvuru, NTR | Sep 15, 2025 తిరువూరు పట్టణంలోని సర్వోదయ పాఠశాల వద్ద బిల్డింగ్ పై కప్పు కుప్పకూలింది. అయితే అప్పుడే వస్తున్నా విద్యార్థులకు తృటిలో ప్రమాదం తప్పిందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఆ ప్రాంతంలో పార్కింగ్ చేసి ఉన్న స్కూటీ పూర్తిగా ధ్వంసం అయింది. విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు కూలిపోయిన బిల్డింగు పెచ్చులను తొలగిస్తున్నారు.