కర్నూలు: మొండి బకాయిదారుల ఆస్తులు జప్తు చేస్తాం: కర్నూలు నగరపాలక అదనపు కమిషనర్ ఆర్‌జివి కృష్ణ
కర్నూలు నగరపాలక సంస్థకు పన్నులు చెల్లించకుండా సంవత్సరాల తరబడి కాలయాపన చేసే వ్యాపార, వాణిజ్య సముదాయాల ఆస్తులను జప్తు చేస్తామని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఆర్‌జివి కృష్ణ హెచ్చరించారు. బుధవారం ముజఫర్‌నగర్ సమీపంలోని న్యూడిల్స్ తయారీ పరిశ్రమ యజమాని గోవర్ధన్‌నగర్ యస్.రాధాకృష్ణ మూర్తికి చెందిన రూ.8,33,761/-లు, ఆటోనగర్‌లోని స్టార్ మోటార్స్‌కు చెందిన రూ.4,96,566/-ల ఆస్తి పన్ను బకాయిలను అనేక సంవత్సరాలుగా చెల్లించకపోవడంతో సదరు రెండు వ్యాపార సముదాయాలను అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్ సతీష్‌కుమార్ రెడ్డి, రెవెన్యూ విభాగ సిబ్బందితో కలిసి సీజ్ చేశారు.