నిజామాబాద్ రూరల్: తల్లిదండ్రుల తరువాత గురువులే విద్యార్థి జీవితాన్ని తీర్చిదిద్దే మహోన్నత శిల్పులు: పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
తల్లిదండ్రుల తరువాత గురువులే విద్యార్థి జీవితాన్ని తీర్చిదిద్దే మహోన్నత శిల్పులనీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జ్ఞానం మాత్రమే కాకుండా విలువలు, నీతి, క్రమశిక్షణ, మానవత్వం గురువుల ద్వారానే విద్యార్థులు నేర్చుకుంటారని గుర్తు చేశారు. చరిత్రలో చాణక్య మార్గదర్శకత్వంతో చంద్రగుప్తుడు మహారాజుగా ఎదిగిన ఉదాహరణను ఈ సందర్భంగా ప్రస్తావించారు. నిజామాబాద్ నగర శివారులోని బృందావన్ గార్డెన్స్‌లో ట్రస్మా ఆధ్వర్యంలో టీచర్స్ డే సెలబ్రేషన్స్ మరియు బెస్ట్ టీచర్ అవార్డుల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మహేష్ కుమార్ గౌడ్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.