గుంతకల్లు: గుత్తి మండలం బసినేపల్లి గ్రామంలో లారీ ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు, కర్నూలులో చికిత్స పొందుతూ మృతి
అనంతపురం జిల్లా గుత్తి మండలం బసినేపల్లి గ్రామ శివారులో బైక్ ను లారీ ఢీకొని ఖుర్షీదా అనే మహిళ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ కర్నూలులో మృతి చెందింది. గుత్తి ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంతకల్లు మండలంలోని ఎన్.తిమ్మాపురం గ్రామానికి చెందిన నబీరసూల్, ఖుర్షీదా దంపతులు ఈ నెల 15న గుత్తి మండలం బసినేపల్లి గ్రామంలో బంధువుల శుభకార్యానికి వచ్చారు. తిరిగి వెళ్తున్న సమయంలో గ్రామంలో లారీ వెనుక నుంచి ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఖుర్షీదా కర్నూలులో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.