పెదకూరపాడు నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఎడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. పెదకూరపాడు ఎన్నికల కార్యాలయాన్ని అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. ఎలాంటి ర్యాలీలు, అల్లర్లు లేకుండా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. అనంతరం ఆర్వో కందుల శ్రీరాములను కలిశారు.