కడప: అప్సర సర్కిల్ పరిసర ప్రాంతాల్లో వర్షాల కారణంగా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను పరిశీలించిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు
Kadapa, YSR | Oct 29, 2025 కడప నగరంలోని అప్సర సర్కిల్ పరిసర ప్రాంతాల్లో వర్షాల కారణంగా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం జరుగుతున్న పనులను టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు & కడప జిల్లా అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి గారు స్వయంగా పరిశీలించారు. అలాగే బుగ్గ వంక ప్రాంతంలోని షామీర్య బ్రిడ్జ్, జువెనైల్ హోమ్ సమీప ప్రాంతాల్లో వర్షపు నీటి ప్రవాహ పరిస్థితిని కూడా ఆయన ప్రత్యక్షంగా సమీక్షించారు. వర్షాల సమయంలో నీరు నిలిచిపోకుండా డ్రైనేజ్ వ్యవస్థను బలోపేతం చేసే పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.