నిజామాబాద్ రూరల్: లింగాపూర్ లో మినీ వాటర్ ట్యాంక్ కబ్జార్ చేయాలని చూస్తున్న వారిపై చర్యలు తీసుకోండి కాలనీ వాసుల వినతి
ఇందల్వాయి మండలం లింగాపూర్ గ్రామంలో మినీ వాటర్ ట్యాంక్ స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ మేరకు అధికారికి వినతిపత్రం సమర్పించారు. సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన కొండ రవి గ్రామంలో కరోబార్ పని చేస్తుంటారని తెలిపారు. అతని కుటుంబానికి చెందిన రాములు నరసయ్య శ్రీధర్ కలిసి కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎస్సీ కాలనీలో త్రాగునీటి సమస్య ఎక్కువ కావడంతో మినీ వాటర్ ట్యాంకును నిర్మించాలని, ప్రస్తుతం ఆ ట్యాంకులు కబ్జాకు గురవుతుందని కాలనీవాసులు తెలిపారు.