అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని కాలనీలలో వైయస్సార్సీపి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని స్థానిక నాయకులు గురువారం సాయంత్రం ఇంటింటా వెళ్లి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.వైఎస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు ఉరవకొండ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టామని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీనివాసులు, ప్రసాద్, కరుణాకర్ పురుషోత్తం, పాతన్న వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు.