అనంతపురం అర్బన్: బియ్యం కోసం వెళ్లి ప్రమాదవశాత్తు ఆటోలో నుంచి పడి వివాహితకు తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Apr 3, 2026
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలం చాలు వారి పల్లి తండాలో ప్రమాదవశాత్తు ఆటోలో నుంచి పడడంతో గ్రామానికి చెందిన కృష్ణమ్మ అనే వివాహితకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఆమెను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం 108 సహాయంతో తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.