ఒంగోలు అర్బన్: ఒంగోలు మండలం చెరువు కొమ్ముపాలెంలో తీవ్ర విషాదం, రెండు రోజుల క్రితం అదృశ్యమైన బాలుడు రిజల్ట్స్ మృతి
Ongole Urban, Prakasam | Jul 8, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం చెరువు కొమ్ముపాలెంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాలుడు రిచర్డ్స్ రేయాన్ గ్రామ సమీపంలోని చెరువుకుంటలో పడి మృతి చెందాడు. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన బాలుడు అదృశ్యం అవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారాన్ని అందించి ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలుడి కోసం పది బృందాలుగా వేర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే బాలుడు గ్రామ సమీపంలోని చెరువుకుంటలో పడి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించి జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.