మారువేషాల్లో పేకాట స్థావరంపై ఒంగోలు టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు. పదిమంది అరెస్ట్
Ongole Urban, Prakasam | May 12, 2026
ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక పోలీసు బృందాలు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో టాస్క్ ఫోర్స్ సీఐ భీమ నాయక్ ఆధ్వర్యంలో ఎస్సై చెంచయ్య మరియు సిబ్బంది కలసి సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమరాజు పల్లి గ్రామ సమీపంలో కోత ముక్క పేకాట ఆడుతున్న 10 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.65,500/- నగదు మరియు 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జూద క్రీడలు మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.