వేటపాలెం-చీరాల బైపాస్ లో అదుపుతప్పి స్కూటీ,ఆటో లను ఢీకొన్న కారు,ఏడుగురికి గాయాలు, మద్యం మత్తులో యువకుల నిర్వాకం
వేటపాలెం- చీరాల బైపాస్ రోడ్డులో ఆదివారం సాయంత్రం ఒక కారు అదుపుతప్పి స్కూటీని,ఆటోను ఢీకొంది.దీంతో ఏడుగురు గాయపడ్డారు. బీచ్ కు వచ్చిన కొందరు యువకులు మద్యం మత్తులో ఆ కారును ఇష్టారీతిగా నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందింది. రోడ్డుపై వాహనాలను ఢీకొన్న అనంతరం ఆ కారు పక్కనున్న పొలాల్లోకి దూసుకుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.