ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు మండలం కోటేకల్ వద్ద రెండు కార్లు ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో గాయపడిన కర్ణాటకకు చెందిన 68 ఏళ్ల గంగమ్మ మృతి..
ఎమ్మిగనూరు పరిధిలోని కోటకల్ గ్రామ మలుపు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన కర్ణాటకకు చెందిన 68 ఏళ్ల గంగమ్మ సోమవారం రాత్రి కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనలో గత రెండు రోజుల్లో ఐదుగురు మరణించగా, ముగ్గురు పెద్దలు, ఇద్దరు చిన్నారులు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య ఆరు చేరింది. గాయపడ్డ డ్రైవర్ చేతన్ ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.