జహీరాబాద్: ధనసిరి లో అగ్ని ప్రమాదానికి గురైన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే మాణిక్ రావు
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని ధనసిరి గ్రామంలో అగ్ని ప్రమాదానికి గురైన ఇంటిని ఎమ్మెల్యే మాణిక్ రావు పరిశీలించారు. గ్రామానికి చెందిన కామిరెడ్డి ఇల్లు ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురై పెద్ద ఎత్తున నష్టపోయిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శనివారం ఉదయం గ్రామానికి చెందిన బాధిత కుటుంబ సభ్యులతో అగ్ని ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. సంబంధిత శాఖ అధికారులతో నష్టపరిహారం విషయంపై మాట్లాడి బాధిత కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు. ఎమ్మెల్యేలతో పాటు బి ఆర్ ఎస్ మండలఅధ్యక్షులు సంజీవరెడ్డి తదితరులు ఉన్నారు.