శంకరంపేట ఏ: తుంకిపల్లి గ్రామంలో మద్యపాన నిషేధం పై తీర్మానం
తుంకిపల్లి గ్రామంలో మద్యపాన నిషేధం పై తీర్మానం కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలంలోని తునికి పల్లి గ్రామంలో మద్యపానంపై నిషేధం విధించారు. గ్రామస్తుల ఆరోగ్యం దృష్ట్యా మంగళవారం ఉదయం 10 గంటలకు ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజాభిష్టం మేరకు గ్రామ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రామ కట్టుబాటుకు విరుద్ధంగా ఎవరైనా మద్యం అమ్మినట్లయితే లక్ష రూ.ల జరిమానా విధిస్తామన్నారు. మందు అమ్మినవారి సమాచారమిచ్చిన వారికి 20 వేల రూపాయల నజరానా ప్రకటించారు.