కొత్తగూడెం: చాకలి ఐలమ్మ 130వ జయంతి సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
లక్ష్మీదేవి పల్లి జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు చాకలి ఐలమ్మ 130వ జయంతి సందర్బంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించారు.ఎస్పీ తో పాటు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ నరేందర్,కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయని అన్నారు