కావలి: మద్యం దుకాణం తొలగించాలని ఆర్డీఓకి వినతి...
కావలి పట్టణం రామూర్తి పేట పుల్లారెడ్డి నగర్ వీధి వద్ద మద్యం దుకాణం నిర్వహిస్తున్నారని, దానిని తొలగించాలని మంగళవారం ఆ ప్రాంత ప్రజలుతో కలిసి టీడీపీ 13వ వార్డు అధ్యక్షుడు శ్రీకాంత్ ఆర్డీవో వంశీకృష్ణాకి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ..పుల్లారెడ్డి నగర్లో స్కూళ్లు, గుడిలు ఉన్నాయని, వాటికి దగ్గరగా మద్యం దుకాణం ఏర్పాటు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమం మంగళవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగింది.