ఆత్మకూరు: ఏఎస్ పేట దర్గాలో 252వ గంధం మహోత్సవంలో భాగంగా ఘనంగా నిర్వహించిన ఫకీర్ సాహెబ్ గలీఫ్ ఉత్సవం
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, ఏ.ఎస్.పేటలో హజరత్ ఖాజా నాయబ్ రసూల్ వారి 252వ గంధ మహోత్సవంలో భాగంగా ఫకీర్ సాహెబ్ గలేఫూ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక నగర్ ఖానా సెంటర్లో ఫకీర్ సాహెబ్ ఇంటి నుంచి గలేఫులు, గంధం, పూల చద్దర్లు సిద్ధం చేసి, వంశస్తులు తలపై పెట్టుకొని దర్గా వైపు బయలుదేరారు. ఫకీర్ల వాయిద్యాలు, కొబ్బరి దివిటీలు, బాణాసంచా పేలుళ్ల నడుమ గాయకులు నాత్ షరీఫ్ కీర్తనలతో ఊరేగింపుగా దర్గాకు చేరుకున్నారు. అనంతరం దర్గాలో ప్రత్యేక నమాజులు చేశారు. ఈ ఈ సందర్భంగా సోమవారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.