బనగానపల్లె: కొలిమిగుండ్లలో పంట పొలాలకు మంటలు, అదుపు చేసిన ఫైర్ సిబ్బంది
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల సాయిబాబా గుడి వెనుక ఉన్న పంట పొలాల వద్ద సోమవారం సాయంత్రం మంటలు చెలరేగాయి. బహిరంగ ప్రదేశంలోని కంపచెట్లకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో అవి వేగంగా పొలాలకు వ్యాపించాయి. రాంకో ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. రాత్రి పొద్దుపోయాక మంటలు ఆగిపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాదంతో పంటలకు ముప్పు వాటిల్లింది.