ఒంగోలు అర్బన్: పారిశుధ్యం, త్రాగునీటి పథకాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు: జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | May 30, 2026
పారిశుధ్యం, త్రాగునీటి పథకాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించేందుకు మరింత దృష్టి సారించాలన్నారు. ' పల్లెనిద్ర ' కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి అద్దంకి నియోజక వర్గం, కొరిశపాడు మండలంలోని పి.గుడిపాడు గ్రామంలో నిద్రించిన జిల్లా కలెక్టర్, శనివారం ఉదయం గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీటిని సరఫరా చేస్తున్న తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి ఈ సేవలతోపాటు స్థానిక సమస్యలపై ఆరా తీశారు. వారి నుంచి అర్జీలను స్వీకరించారు.