అర్హులైన ప్రతి ఒక్కరికి గృహాలు మంజూరు. హౌసింగ్ పీడీ రమేష్ రెడ్డి .
అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండల ఎంపీడీవో కార్యాలయంలో హౌసింగ్ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించిన అన్నమయ్య జిల్లా హౌసింగ్ పీడీ రమేష్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వం నిర్మించే ఇళ్ల కోసం ఈనెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రామసముద్రం మండలంలో 1090 మంది గుర్తించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాపరిషత్ అధికారులు పాల్గొన్నారు.