ఆత్మకూరు: ఆత్మకూర్:మండల కేంద్రంలో జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎస్సై నరేందర్
ఆత్మకూరు పట్టణ కేంద్రంలోని చర్ల పరమేశ్వర స్వామి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రత ఏర్పాట్లను పరిశీలించినట్లు ఎస్ఐ నరేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన చెరువులో ఉన్న పరమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాట్లను సాయంత్రం నాలుగు గంటలకు పరిశీలించారు.చెరువు సమీపంలో ఆలయం ఉన్నందున చిన్నారులు మహిళలు దర్శనానికి వచ్చే సమయంలో ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది,కావున ఆలయం చుట్టు కట్టెలతో ఏర్పాట్లను మున్సిపల్ వారి ఆధ్వర్యంలో పూర్తిచేసినట్లు తెలిపారు.