చింతపల్లి: వంగూర్: పీకే మల్లెపల్లిలో ఈనెల 21 నుండి 23 వరకు జరగనున్న ఉర్సు ఉత్సవాల ఏర్పాట్లు పరిశీలించిన నాంపల్లి సీఐ నవీన్ కుమార్
నల్గొండ జిల్లా, చింతపల్లి మండల పరిధిలోని పీకే మల్లేపల్లి లో ఈనెల 21 నుండి 23 వరకు జరగనున్న హజరత్ అబ్బాస్ షరీఫ్ దర్గా ఉర్సు ఉత్సవాల ఏర్పాట్లను మంగళవారం సాయంత్రం నాంపల్లి ఎస్సై నవీన్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఉర్సు ఉత్సవాల నిర్వాహకులకు పల సూచనలు చేశారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరుకానున నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట చింతపల్లి ఎస్సై యాదయ్య, మర్రిగూడ ఎస్ఐ కృష్ణారెడ్డి, సిబ్బంది తదితరులు ఉన్నారు.