అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వజ్రకరూరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మోనాలిసా జాతీయస్థాయిలో మూడవసారి బెస్ట్ పెర్ఫార్మన్స్ అవార్డు అందుకున్నారు. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూ సిఐ)ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ఈనెల 16 నుంచి 19 వరకు నాలుగు రోజుల పాటు సర్పంచ్ శక్తి కార్యక్రమంలో శుక్రవారం 'మహిళా సాధికారత'అనే అంశంపై అనర్గళంగా ప్రసంగించిన సందర్భంగా క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధుల బృందం పరిశీలించి సర్పంచ్ మోనాలిసా ను బెస్ట్ పర్ఫామెన్స్ జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక చేసి క్యూ,సి,ఐ ప్రతినిధి హిమాన్స్ పాటిల్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.