ఆత్మకూరు: సంగం బ్యారేజ్ కు ఎటువంటి నష్టం లేకుండా బోటును తొలగించిన అధికారులు, సిబ్బందిని అభినందించిన మంత్రి లోకేష్
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, సంగం బ్యారేజీ వద్ద 30 టన్నుల బరువున్న ఇసుక బోటును NDRF, SDRF, పోలీసులు, ఫైర్, ఇరిగేషన్ అధికారులు తొలగించారు. నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా, SP అజిత వేజెండ్ల పర్యవేక్షణలో బ్యారేజీకి ఎలాంటి నష్టం కలగకుండా ఒడ్డుకు చేర్చడంతో ప్రశంసలు వస్తున్నాయి. 'టీం వర్క్‌తో అతిపెద్ద జలగండాన్ని తప్పించిన మీ కృషికి హ్యాట్సాఫ్' అని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. సంగం బ్యారేజ్ కు ఇబ్బంది కలగకుండా బోట్లను చాకచక్యంగా తొలగించారు. సంబంధిత ఆపరేషన్ విజయవంతం కావడంతో ఆత్మకూరు ఆర్డీవో బి.పావని హర్షం వ్యక్తం చేశారు. బోట్లను తొలగించిన NDRF, SDRF సిబ్బందిని ఆమె సత్కరి