డోన్: బేతంచెర్ల లో చెత్తాచెదారంతో నిండిపోయిన కాలనీ, స్పందించిన శానిటేషన్ సిబ్బంది
Dhone, Nandyal | Apr 25, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల నగర పంచాయతీలోని దుర్గాపేట కాలనీ చెత్తాచెదారంతో నిండిపోయింది. దీంతో దోమల బెడద ఎక్కువైందని, అంటువ్యాధులు ప్రబలుతాయని, కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో చాలా రోజుల నుంచి కాలువలు తీయకపోవడంతో చెత్తతో పేరుకుపోయాయి. మురుగునీరంతా పైకి వచ్చి రోడ్డంతా చెత్తాచెదారంతో దర్శనమిస్తోంది. ఇప్పటికైనా శానిటేషన్ ఆఫీసర్లు చొరవ చూపి తమ కాలనీని శుభ్రం చేయించాలని కాలనీవాసులు కోరారు ఈ విషయంపై శానిటేషన్ సిబ్బంది స్పందించి శనివారం కాలనీ శుభ్రం చేశారు