బోయిన్‌పల్లి: మానువాడ వరద వెళ్లి గ్రామాల్లో ఏడు రోజుల్లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
రాజన్న సిరిసిల్ల జిల్లా,బోయిన్పల్లి మండలం,మానువాడ వరద వెళ్లి గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి,తెలంగాణలో ఆడపడుచులకు అతిపెద్ద పండగ అయినా బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల్లో ఘనంగా జరుపుకుంటారు,అయితే కొన్ని గ్రామాల్లో మాత్రం ప్రత్యేకంగా ఏడు రోజుల్లో పండగ జరుపుకోవడం ఆనవాయితీగా వరద వెళ్లి మానువాడ గ్రామాల్లో శనివారం అత్యంత ఘనంగా వైభవంగా జరుపుకున్నారు,గ్రామ మహిళలు అనంతరం రాత్రి ఎనిమిది గంటల 20 నిమిషాల నుండి గ్రూపుల వారిగా చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేశారు,బతుకమ్మలు నిమజ్జనం అప్పుడు గట్టి భద్రత చర్యలు తీసుకున్నారు గ్రామాలకు సంబంధించిన అధికారులు,