తణుకు: వేల్పూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాధాకృష్ణ
క్రమశిక్షణ, పట్టుదలతో గతంలో పని చేసిన ఛైర్మన్లు వేల్పూరు సొసైటీను అభివృద్ధి పథంలో నిలిపారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. పాలవర్గంతోపాటు ఇక్కడి రైతులు అందించిన సహాయ సహకారాలు, క్రమశిక్షణతోనే అభివృద్ధి సాధ్యమైందన్నారు. తణుకు మండలం వేల్పూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సర్వసభ్య సమావేశం మంగవారం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు.