అధికారుల పనితీరుకు కే.పీ.ఐ లో సాధించిన పురోగతే నిదర్శనం : జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Apr 7, 2026
అధికారుల పనితీరుకు ' కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ' (కే.పీ.ఐ)లో సాధించిన పురోగతే నిదర్శనమని జిల్లా కలెక్టర్ రాజాబాబు చెప్పారు. ఈ దిశగా మండల స్థాయి లక్ష్యాలను గుర్తించి, స్వర్ణాంధ్ర వెబ్ సైట్ లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. ప్రాథమిక రంగాలకు సంబంధించిన లక్ష్యాలను గుర్తించడం, వాటిని సాధించడంపై మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి ఆయన డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ అంశాలలో సాధించిన పురోగతి ప్రతిబింబించేలా కే.పీ.ఐ.లను రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిందన్నారు. స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ఆయా రంగాలలో వృద్ధి సాధించాలన్నారు