కోడుమూరు: పెంచికలపాడు వద్ద బొలెరో కారు ఢీ, ఒకరికి తీవ్ర గాయాలు
గూడూరు మండలంలోని కే నాగలాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో పెంచికలపాడు విశ్వభారతి ఆసుపత్రి సమీపంలో గత రాత్రి బొలెరో, కారు ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలైనట్లు ఎస్సై శరత్ కుమార్ రెడ్డి మంగళవారం తెలిపారు. టమోటా బాక్సులతో వెళ్తున్న బొలెరో వాహనం, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం పోలీసులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.