నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో నష్టాల్లో మామిడి రైతులు
Nandyal Urban, Nandyal | May 16, 2026
నంద్యాల జిల్లాలో మామిడి రైతులు తీవ్ర నష్టాల్లో మునిగిపోయారు. జిల్లా వ్యాప్తంగా 10 వేల ఎకరాల్లో రైతులు మామిడి సాగు చేశారు. అయితే ఈ ఏడాది మామిడి దిగుబడి భారీగా తగ్గడంతో నష్టాలు తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. వర్షాభావ పరిస్థితులు, చీడపీడల కారణంగా మామిడి దిగుబడి తగ్గిందని, వచ్చిన దిగుబడి కూడా నాణ్యత లేమీ కారణంగా ధర పలకడం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు ధరలు కూడా పడిపోయాయి.