విశాఖపట్నం: ఎల్జి పాలిమర్స్ బాధితులకు భారీ ఊరట, భూగర్భ జలాలు కలుషితం, తాగునీటి ప్లాంట్ ఏర్పాటు చేసిన యాజమాన్యం
ఎల్. జి. ఇండియా .సి. ఎస్.ఆర్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం. ఎంపీ భరత్, ప్రభుత్వ విప్ గణబాబు చేతుల మీదుగా ప్రారంభం. ఎల్జీ పాలిమర్స్ స్టైరిన్ గ్యాస్ లీక్ ఘటనలో ఊరంతా భూగర్భ జలాలు కలుషితమై, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎల్జీ కంపెనీ బాధ్యత వహిస్తూ తాగునీటి కోసం శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది.ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో ప్లాంట్ ను ప్రారంభించారు దీనిని శ్రీభారత్ 98 వ వార్డులో ప్రారంభించారు.