మైదుకూరు మండలం వనిపెంట జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో బుధవారం స్వచ్ఛతాహీ సేవ, మహిళా రైతు దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వనిపెంట కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ మహిళలు ఆహార భద్రతలో కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. మహిళలు రైతులు, రైతు కూలీలుగా పంటలను పండించడంలో విశేష పాత్ర వహిస్తున్నారని చెప్పారు. విద్యార్థినులు పరిశుభ్రతను పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.