ఒంగోలు అర్బన్: హౌస్ లిస్టింగ్ సెన్సస్ ను నాలుగు రోజుల్లోగా పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలి :జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | May 22, 2026
హౌస్ లిస్టింగ్ సెన్సస్ ను నాలుగు రోజుల్లోగా పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. దీనిపై శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గత జనాభా లెక్కలతో పోల్చితే ప్రస్తుత పరిస్థితులను బట్టి ప్రతిపాదిత వృద్ధికి, వాస్తవ సర్వేకు ఉన్న వ్యత్యాసంపై ఆయన ఆరా తీశారు. సర్వేలో ఎక్కడా లోపాలు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రారంభంతో పోల్చితే గత వారంలో మంచి పురోగతి కనిపించిందని, ఈ సర్వేను వేగవంతం చేయాలని ఆయన చెప్పారు.